![]() |
![]() |

జోర్దార్ సుజాత..యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి షోస్ లో కనిపిస్తూ జబర్దస్త్ లో కామెడీ చేస్తూ రాకేష్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఇక ఇప్పుడు సుజాత రాకేష్ కోసం ఒక ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చింది. మరి ఆ కథా కమామిషు ఏంటో చూద్దాం..."ఫిబ్రవరి అంటే అందరికీ వాలెంటైన్స్ డే స్పెషల్ మాత్రమే కానీ నాకు మాత్రం మ్యారేజ్ డే, వాలెంటైన్స్ డే స్పెషల్స్ రెండు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. మా పెళ్లై ఏడాది అయ్యింది. నాకు ఫిబ్రవరితో మంచి అనుబంధం ఎన్నో మెమోరీస్ కూడా ఉన్నాయి. ఈ స్పెషల్స్ డేస్ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వాబోతున్నాను నా హజ్బెండ్ కి. నేను మా ఆయన కోసం ఒక ఇల్లు తీసుకున్నా.
మా ఆయనకి ఈ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ ఇల్లు తీసుకున్నట్లు ఆయనకు కూడా తెలీదు. ఈ ఇల్లు పూర్తి కావటానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది. కానీ ఈ మంత్ లో ఈ విషయాన్ని రివీల్ చేసేద్దామనుకుంటున్నా..అసలు సర్ప్రైజ్ గా ఫీలవుతాడా...చెప్పగానే తిడతాడా..చూడాలి ... ఇక ఆ ఇల్లు చూసి ఫ్యూచర్ లో ఇలాంటిది తీసుకోవాలి అని రాకింగ్ రాకేష్ చెప్పేసరికి సుజాత షాకిచ్చేలా ఏవండీ ఇది మనదే...కంగ్రాట్యులేషన్స్..ఐ లవ్ యు..అని చెప్పింది..రాకేష్ అవాక్కయ్యాడు.. బీపీ లో ఐనట్టు రక్తపోటు పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టుగా ఉంది. లవ్ ఇంత కాస్ట్లీగా ఉంటుందా అన్నాడు. ఎన్నిసార్లో వచ్చి ఈ ఇల్లు చూసుకుంటూ ఉన్నానో . మీకు ఎన్నో సార్లు చెప్పాలి అనుకున్నా... ఈ ఇల్లు మీ పేరు మీదే తీసుకున్నా అని సుజాత చెప్పింది. ఐతే నువ్వు ఒక అమ్మాయిగా ఎంతో సాధించి ఇంతగా ఎదిగావు..దయచేసి నాకు ఇలా షాకిచ్చినట్టు మా అమ్మకు మాత్రం షాకులు ఇవ్వకు అని చెప్పాడు. తర్వాత కాసేపు ఆట పట్టించి అప్పుడు రియల్ షాక్ ఇచ్చింది. ఈ ఇల్లు మనది కాదు అని ప్రాంక్ చేసేసరికి..నేను అనుకున్నా ఇది మనది కాదు..ఏదో కథలు చేస్తున్నావని. కానీ నువ్వు సతీ సావిత్రి రేంజ్ లో నటించావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది..నెక్స్ట్ టైం ఇలాంటి ఏమీ వినను అన్నాడు.. ఫీలవకండి నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని చెప్పింది." సుజాత..ఫైనల్ గా ఇల్లు లేదు ఏమీ లేదు అంతా ప్రాంక్ అని చెప్పేసింది.
![]() |
![]() |